
ఇష్టారాజ్యంగా ఈ–క్రాప్ నమోదు
రెండున్నర నెలలు గడిచినా
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంటల నమోదు అస్తవ్యస్తంగా మారింది. పొలంపై ఉన్న పంట ఒకటైతే.. ఈ–క్రాప్‌లో నమోదు చేస్తున్న పంట మరొకటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ఉన్న ఐదేళ్లు పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంటల నమోదు ప్రక్రియ అవకతవకలకు కేంద్రమవుతోంది. ఖరీప్ సీజన్ సెప్టెంబర్ 30తోనే ముగిసిపోయినప్పటికీ పంటల నమోదు అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు కేవలం 4,11,704 సర్వే నెంబర్లలోని 6,94,235 ఎకరాలు నమోదు చేశారు. రెండున్నర నెలల్లో 41.6 శాతం మాత్రమే పంటల నమోదు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆలూరు, ఓర్వకల్, చిప్పగిరి, హాలహర్వి, కర్నూలు రూరల్ మండలాల్లో పంటల నమోదు అంతంతమాత్రంగానే ఉన్నట్లు వెల్లడవుతోంది. నమోదు అస్తవ్యస్తం కావడం, సుదీర్ఘంగా సాగుతుండటంతో ప్రభుత్వం ఈ–క్రాప్ బుకింగ్‌ను ఈ నెల 25 వరకు పొడిగించింది. పై నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో పంటల నమోదులో వీఏఏలు, వీహెచ్‌ఏలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే గ్రామస్థాయిలో టీడీపీ నేతలు, రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జీలు కుమ్మకై ్క ఉల్లి పంటను నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పత్తి దా దాపు 6 లక్షల ఎకరాల్లో సాగయింది. ఈ–క్రాప్‌లో మాత్రం పత్తి నమోదు మందగించింది. కోడుమూ రు, దేవనకొండ, కర్నూలు రూరల్, పత్తికొండ, సీ.బెలగల్, గోనెగండ్ల తదితర మండలాల్లో ఏకపక్షంగా ఉల్లి నమోదవుతుందటం గమనార్హం.
నోటిఫైడ్ పంటలకు మాత్రమే ఈ–కేవైసీ
గతంలో ఈ–క్రాప్‌లో నమోదైన అన్ని పంటల నమోదుకు రైతుల నుంచి ఈ–కేవైసీ తీసుకున్నారు. బయోమెట్రిక్ ద్వారా లేదా ఓటీపీ ద్వారా ఈ–కేవైసీ చేయించారు జరిగేది. ఈ సారి మాత్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా కింద నోటిఫై చేసిన పంటలకు మాత్రమే ఈ–కేవైసీ చేయించుకునేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు కరువయ్యాయి.
మొదట్లో అనుమానం వచ్చినా రాజీ పడ్డారు
41.6 శాతమే పూర్తి
ఈ–క్రాప్‌లో ఉల్లి పంట శరవేగంగా నమోదవుతుండటాన్ని గమనించిన జిల్లా ఉన్నతాధికారులు విస్తు పోయారు. తహసీల్దార్లు, ఆర్‌డీఓలతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాత రాజీపడి మిన్నకుండిపోయారు. అధికార టీడీపీ నేతల సూచనలతో ఈ–క్రాప్‌లో ఉల్లి నమోదు పరిశీలన ప్రక్రియ మరుగున పడినట్లు తెలుస్తోంది. ఉల్లి సాధారణ సాగు 41,442 ఎకరాలు మాత్రమే. ఈ సారి ఈ–క్రాప్‌లో ఇప్పటికే 58 వేల ఎకరాలకు చేరిందంటే.. పంటల నమోదు ప్రక్రియ ముగిసే సమయానికి 75 వేల ఎకరాలకు చేరే అవకాశం ఉన్నట్లు ఉద్యాన అధికారులు అంచనా వేస్తున్నారు.