ఐద్వా జిల్లా నూతన కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఐద్వా జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Oct 9 2025 2:51 AM | Updated on Oct 9 2025 2:51 AM

ఐద్వా

ఐద్వా జిల్లా నూతన కమిటీ ఎన్నిక

● అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్‌.శ్యామల, కె.అరుణ

కర్నూలు(సెంట్రల్‌): ఐద్వా జిల్లా నూతన కమిటీ ని 35 మందితో ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకోగా గౌరవాధ్యక్షురాలుగా పి.నిర్మల అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్‌.శ్యామల, కె.అరుణ, కోశాధికారిగా పీఎస్‌ సుజాతలతో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు, మగ్గురు సహాయ కార్యదర్శులు, 13 మంది ఆఫీసు బేరర్లు, 22 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో బుధవారం కార్మిక, కర్షక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. బెల్టుషాపుల రద్దు, మద్యం దుకాణాల సమయాన్ని కుదింపు కోసం పోరాటాలు చేస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేయాలన్నారు.

యువకుడి బలవన్మరణం

ఆలూరు రూరల్‌: ఆర్థిక కష్టాలతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కురుకుంద గ్రామానికి చెందిన శివప్ప (32) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పక్షవాతం వచ్చి తండ్రి మునెప్ప మంచాన పడ్డాడు. ఎనిమిదేళ్ల క్రితం శివప్ప అన్న మృతిచెందాడు. తల్లి మల్లమ్మ, కుమారుడు శివప్ప వ్యవసాయ పనులకు వెళ్లేవారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక మూడు రోజుల క్రితం ఇంటి నుంచి శివప్ప వెళ్లిపోయాడు. ఆలూరులోని గుంతకల్లు రహదారి పక్కన పురుగు మందు తాగి శవమై కనిపించాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్థిని ఆత్మహత్య

సంజామల: కానాల గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు.. కానాల గ్రామనికి చెందిన ఏరాశి దస్తగిరి, సుశీల కుమార్తె ఏరాశి శ్యామల(17) అవుకు మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ రెండవ సంవత్సరం చుదువుతోంది. దసరా సెలవుల నుంచి ఇంటి దగ్గరనే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆయిల్‌ ఇంజిన్‌లో పాము

మహానంది: బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణ, మరికొంత మంది రైతులు బుధవారం వారి పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి ఆయిల్‌ ఇంజిన్‌ను ఆన్‌ చేయగా ఎంత సేపటికి ఆన్‌ కాలేదు. ఏమైందోనని పరిశీలించగా ఫ్యాన్‌ (పంకా) వద్ద ఓ పాము ఇరుక్కపోయి ఉండటాన్ని గుర్తించారు. బతికి ఉందేమోనని చూస్తే అది అప్పటికే మృతి చెందినట్లు చూసి తీసేశారు.

ఐద్వా జిల్లా  నూతన కమిటీ ఎన్నిక 1
1/2

ఐద్వా జిల్లా నూతన కమిటీ ఎన్నిక

ఐద్వా జిల్లా  నూతన కమిటీ ఎన్నిక 2
2/2

ఐద్వా జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement