
ప్రమాదపుటంచున కొత్తపల్లె చెరువు
కోడుమూరు రూరల్: కొత్తపల్లె చెరువు కట్ట కోతకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇదే సమయంలో కొతపల్లె నుంచి కృష్ణగిరి వైపు వెళ్లే దారిలో ఉన్న చెరువు కట్ట బలహీనంగా ఉండడంతో కొంత భాగం కోతకు గురై చె రువులోని నీళ్లన్నీ రైతుల పొలాలను ముంచెత్తుతున్నాయి. అధికారు లు కోతకు గురైన చెరువు కట్టకు సకాలంలో మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేయడంతో రోజురోజుకు కోత పెరిగిపోతుంది. భారీ వర్షాలు పడి చెరువుకు నీళ్లు పోటెత్తితే కట్ట పూర్తిగా కో తకు గురైతే తమ పంట పొలాలు నీట మునిగే పరి స్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే చెరువు కట్టకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.