
తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం
ఎమ్మిగనూరుటౌన్: తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ అసోసియేట్ డైరెక్టర్ రీసెర్చ్ డాక్టర్ ఎం.జాన్సన్ అన్నారు. బనవాసి కేవీకేలో నూనెగింజల మిషన్ ఎన్‌బీహెచ్‌ఎం ఆధ్వర్యంలో శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపై 30 మంది రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. తేనెటీగల పెంపక ప్రాధాన్యత, పంటల పరాగసంపర్కంలో వాటి పాత్ర, తేనె ఉత్పత్తి ద్వారా రైతులు పొందే అదనపు ఆదాయం గురించి పలువురు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.జాన్సన్ మాట్లాడుతూ.. తేనెటీగల శాసీ్త్రయ పెంపకం ద్వారా నూనెగింజలు పంటల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. అలాగే పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడినవారవుతారన్నారు. కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త డాక్టర్ కే.రాఘవేంద్రచౌదరి, శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ అశోక్‌కుమార్, మంజునాథ్, సుజనమ్మ, శివశంకర్, మల్లికార్జున, రమేష్, ఏడీఏ మహమ్మద్‌ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.