ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని కనువిందు చేస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం, గువ్వలకుంట్ల, పాలెంచెరువు, బండినాయిని పాలెం సమీపంలోని వరి పంట పొలాల్లో, ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మొక్కలు విరివిగా ఉన్నాయి. దీనినే నాగేటిగడ్డ, నీరుపిప్పిలి మొక్క అని పిలుస్తుంటారు. ఈ తీగ జాతి మొక్క పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. ఈ పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఈ పుష్పాలను ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలన్నీ విషపూరితం. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, పలు రోగాల నివారణగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల సూచనలు, సలహాల మేరకు వాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. – కొత్తపల్లి
ఎరుపు, పసుపు రంగులతో..
అడవిలో అగ్నిశిఖ
అడవిలో అగ్నిశిఖ