తెల్లబంగారం చిన్నబోతోంది! | - | Sakshi
Sakshi News home page

తెల్లబంగారం చిన్నబోతోంది!

Oct 8 2025 6:19 AM | Updated on Oct 8 2025 6:53 AM

● నేటి నుంచి కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ఆసుపత్రుల్లో క్యాంపులు ● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌

వైఎస్సార్‌సీపీ టాక్స్‌–కర్నూలు యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ టాక్స్‌– కర్నూలు యూట్యూబ్‌ చానల్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి, కాట సాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

దివ్యాంగులకు మరోసారి ‘పరీక్ష’

కర్నూలు(అగ్రికల్చర్‌): దివ్యాంగులు మరోసారి సదరం క్యాంపు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దివ్యాంగుల పింఛను పొందుతూ రీ వెరిఫికేషన్‌లో అనర్హత వేటు పడిన వారిలో అప్పీల్‌ చేసుకున్న వారికి మరోసారి పునః పరిశీలన చేపట్టనున్నారు. కర్నూలు జిల్లాలో 4731 దివ్యాంగుల పింఛన్లు, 17 హెల్త్‌ పించన్‌లు.. నంద్యాల జిల్లాలో 4,099 దివ్యాంగులు, 64 హెల్త్‌ పింఛన్లపై అనర్హత వేటు పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్‌ నెలలోనే తొల గింపులు జరగాల్సి ఉంది. అయితే దివ్యాంగులఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేసింది. అనర్హత ఉన్నట్లు నోటీసులు అందుకున్న కర్నూలు జిల్లాలో 4,286 మంది, నంద్యాల జిల్లాలో 4వేల మందికిపైగా దివ్యాంగులు అప్పీల్‌ చేసుకున్నారు. వీరందరికీ మరోసారి వికలత్వం పరిశీలించే కార్యక్రమం ఈ నెల 8వ తేదీ నుంచి మొదలు కానుంది. ఇందు కోసం కర్నూలు సర్వజన వైద్యశాల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రభుత్వ వైద్యశాలల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి వారం బుధ, గురు, శుక్రవారాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తా రు. కర్నూలు సర్వజన వైద్యశాలలో చెవి, కన్ను, ఆర్థోపెడిక్‌, మానసిక వైకల్యం కలిగిన వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎమ్మిగనూరులో కేవలం ఆర్థోపెడిక్‌, ఆదోనిలో ఆర్థోపెడిక్‌, కన్నుకు సంబంధించి సదరం పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆలూరు: వాల్మీకులను ఓటు బ్యాంక్‌గా చూడకుండా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేయాల్సిన బాధ్యత ఉందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో మంగళవారం వాల్మీకి సంఘం నియోజకవర్గం నాయకుడు భాస్కర్‌ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి పాత బస్టాండు సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహం వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకులు, సంఘ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు. వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ, తదితరులు మాట్లాడారు. ప్రధానంగా వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలోకి చేర్పించేందుకు కూటమి నేతలు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వాల్మీకులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, నాయకులు శ్రీనివాసులు, ఎల్లప్ప, అరికెర వెంకటేశ్వర్లు, వరుణ్‌, వీరేష్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): పత్తి ధరలు తగ్గుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. పత్తికి మద్దతు ధర రూ.8,110 ఉంది. మార్కెట్‌లో మాత్రం క్వింటాకు లభిస్తున్న ధర రూ.7వేల వరకు మాత్రమే. సోమవారం ఆదోని మార్కెట్‌కు 11,623 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా.. కనిష్ట ధర రూ.3,960, మధ్య ధర రూ.7,450.. గరిష్ట ధర రూ.7,769 నమోదైంది. పత్తి క్రయవిక్రయాలు ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మాత్రమే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు దాదాపు 12 వేల క్వింటాళ్ల పత్తి వస్తోంది. మార్కెట్‌లోకి పత్తి వస్తుందంటేనే ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించాలి. మామూలుగా అయితే సెప్టెంబర్‌ 15వ తేదీ నాటికే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అతీగతీ లేని పరిస్థితి. అధిక వర్షాల వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా పత్తి దెబ్బతినింది. సగటు దిగుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతంతమాత్రం వచ్చిన దిగుబడులకు ధరలు లేవు. వెంటనే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదించినా చలనం లేకపోవడం గమనార్హం.

తెల్లబంగారం చిన్నబోతోంది! 1
1/1

తెల్లబంగారం చిన్నబోతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement