
వైభవంగా పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఆలయంలో మూడురోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు.
ప్రత్యేకాలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదుడు