
విద్యార్థిపై చెప్పుతో దాడి
● మంత్రాలయంలో గ్లోబల్ జీనియస్ స్కూలు బస్సు డ్రైవర్ నిర్వాకం ● నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన స్కూలు ఏఓ ● ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
మంత్రాలయం: బడికెళ్లే సమయంలో చిన్న పిల్లలు గో ము చేయడం షరా మామూలే. ఏడ్చుకుంటూ బస్సు ఎక్కిన పిల్లోడిని నచ్చజెప్పాల్సింది పోయి ఓ స్కూలు బస్సు డ్రైవర్ విచక్షణ మరచి కర్కశంగా వ్యవహరించాడు. ఏకంగా విద్యార్థి చెంపపై, తలపై చెప్పుతో బాది గాయపరిచాడు. వివరాల్లోకి వెళితే.. మంత్రాల యం మండల కేంద్రంలోని పాతూరుకు చెందిన మహబూబ్ బాషా,రియాన దంపతుల మొదటి కుమారుడు అయాన్ స్థానిక గ్లోబల్ జీనియస్ ఇంగ్లిస్ మీడి యం స్కూలులో ఎల్‌కేజీ చదువుతున్నాడు. రోజూ మా దిరే బుధవారం స్కూలు బస్సు రాగానే కుమారుడిని తల్లి బస్సు ఎక్కించింది. ఆ సమయంలో అయాన్ ఏడుస్తూ బస్సు ఎక్కాడు. ఆగ్రహించిన డ్రైవర్ నరేష్.. చిన్నోడు అని చూడకుండా విచక్షణ రహితంగా చెప్పుతో బస్సులో బలంగా కొట్టడంతో ఆ చిన్నారి చెంపకు, తలకు ముందు భాగంలో కందిన గాయాలయ్యాయి. చెంపపై రక్తం చిందేంతగా కొట్టాడు. తప్పు చేయడమే కాక చిన్నారి తండ్రి మహబూబ్‌బాషాకు ఫోన్ చేసి మీ పిల్లోడు ఏడుస్తుంటే కాస్త మందలించానని, చిన్నగా కొట్టానని చెప్పాడు. అనుమానం వచ్చిన తండ్రి మహబూబ్ బాషా స్కూలు దగ్గరకు వెళ్లి చూ డగా కందిన గా యాలు కావడంతో ఆందోళనకు గురయ్యాడు. చిన్నా రిని బాదడంపై పాఠశాల ఏఓ రఘువీరను అడుగగా ఆయన కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇలాంటివి మామూలే.. మీరే సర్దుకుపోవాలంటూ బదులిచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చేసేదేమి లేక చిన్నారిని శ్రీమఠం హస్పిటల్‌కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. నరాలు చిట్లి ఉంటే కష్టమని డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పారు. ఇంతగా విద్యార్థి గాయపడినా పాఠశాల ఏవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఎంతో శ్రద్ధగా చూసుకోవాల్సిన ప్రైవేటు స్కూలు యాజమాన్యం ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. విద్యార్థినిని చిదకబాదిన డ్రైవర్, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.