
రాకపోక.. నరకయాతన
ఇది పత్తికొండ – గుత్తి ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు పార్ట్‌హోల్ నిధులు రూ.13 లక్షలు వెచ్చించారు. పత్తికొండ నుంచి చెరువు తండా వరకు గుంతలు పూడ్చినట్లు అధికారులు చెబుతున్నా నెల రోజులకే యథాస్థానానికి చేరుకుంది. తుగ్గలి మండలం రాతన గ్రామ సమీపంలో ఇదే రోడ్డుపై రెండు నుంచి నాలుగు అడుగుల గుంతలు ఏర్పడ్డాయి. అలాగే మండల కేంద్రమైన తుగ్గలిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఏర్పడిన గుంతలతో వర్షపు నీరు నిల్వ ఉండి వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డులోనే జీ ఎర్రగుడి గ్రామం మెయిన్‌రోడ్డు పూర్తి గుంతల మయంగా మారింది.

రాకపోక.. నరకయాతన