
సెల్ఫీలు దిగుతూ.. జలకాలాడుతూ
● జీడీపీ వద్ద సందర్శకుల సందడి
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. అధికారులు గేట్లు ఎత్తి హంద్రీకి నీరు వదిలారు. ఈ నేపథ్యంలో జీడీపీకి సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు, మహిళలు, చిన్నారులు అక్కడికి చేరుకొని ఫొటోలు దిగుతూ..నీటిలో జలకాలాడుతూ సందడి చేశారు. కాగా ఆదివారం గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి 500 క్యూసెక్కుల వరద నీరు రాగా దిగువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. హంద్రీనది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ ఈఈ పాండురంగయ్య సూచించారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హంద్రీనది
కల్లూరు: హంద్రీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నిండడంతో శనివారం అధికారులు ఆ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి హంద్రీకి నీరు వదిలారు. దీంతో ఆ నీరు మండలంలోని రేమడూరు, పుసులూరు, బొల్లవరం, నాయకుల్లు, బస్తిపాడు, చిన్నటేకూరు, పెద్దటేకూరు, లక్ష్మీపురం, కర్నూలు మీదుగా కర్నూలు నగరంలో తుంగభద్రనదిలో కలుస్తుంది.

సెల్ఫీలు దిగుతూ.. జలకాలాడుతూ