కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డల నిల్వలు పేరుకుపోయాయి. ఇటు వ్యాపారులు, అటు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలు బయటకు వెళ్లడం లేదు. దీంతో మార్కెట్‌లో గత రెండు రోజుల నుంచి ఉల్లిగడ్డల కొనుగోలు నిలిచిపోయింది. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం నుంచి రైతులు మార్కెట్ యార్డుకు వాహనాల్లో ఉల్లిగడ్డలు తేస్తున్నారు. లోపల ఉన్న సరుకు ఖాళీ కాకపోవడంతో అధికారులు ఆ ఉల్లిని లోనికి అనుమతించడం లేదు. దీంతో మార్కెట్ యార్డు గేటు నుంచి చౌరస్తా వరకు ఉల్లిలోడ్‌తో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి ధర పడిపోవడంతో పాటు కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్,కర్నూలు