
సమాజాన్ని మార్చే ఆయుధం సాహిత్యం
కర్నూలు కల్చరల్: సమాజాన్ని మార్చే ఆయుధం సాహిత్యం అవ్వాలని తెలంగాణ రాష్ట్రం విశ్రాంత అడిషినల్ డీజీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన రచించిన ‘పుంజు తోక’ పుస్తకాన్ని ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఆయన తల్లిదండ్రులు కృష్ణవేణి, చిన్న సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక మార్పు దిశగా ఇకపై కలం పోరు చేస్తానన్నారు. యువత సాహిత్య రచనలో భాగస్వాములు కావాలన్నారు. రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ.. సమాజ మార్పునకు సాహిత్య రచన దోహదం చేస్తుందన్నారు. కవిత్వం ద్వారా కవులు సమాజానికి ఎంతో సేవ చేస్తారన్నారు. సాహితీ వేత్తలు డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని, డాక్టర్ ఎం.హరికిషన్ పుస్తక సమీక్ష చేశారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, సాహితీ స్రవంతి రాష్ట్ర అద్యక్షుడు కెంగార మోహన్ మాట్లాడారు. కన్వీనర్‌గా మహమ్మద్ మియ్యా వ్యవహరించారు. శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీబీవీ సుబ్బయ్య, కళాక్షేత్రం కార్యదర్శి సి.యాగంటీశ్వర్, కోశాధికారి రామస్వామి, సభ్యులు పాల్గొన్నారు.