
పత్రికలపై కేసులు పెట్టడం సరికాదు
పోలీసుల పదోన్నతుల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. అన్యాయంగా కేసులు నమోదు చేసే సంస్కృతికి తెర లేపింది. ఇది ఏ మాత్రం మంచిది కాదు. పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభం. మీడియా సమావేశంలో నేతలు మాట్లాడిన ప్రసంగాలను పత్రికలో ప్రచురించడం వారి నైతిక ధర్మం. అలాగే సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడం పాత్రికేయుల విధి. దీనిని జీర్ణించుకోలేక మీడియాపై, పత్రిక సంపాదకులపై కేసులు నమోదు చేయడం తగదు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది.
– పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీ, నంద్యాల