
● చాకలి నరేష్‌ను కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించ
న్యాయం కోసం..
దేవనకొండ: న్యాయం కోసం శ్రావణి కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డెక్కారు. గురువారం దేవనకొండకు చెందిన చాకలి నరేష్ భార్యపై అనుమానంతో దాడి చేయడంతో పాటు 8 నెలల కుమారుడిని డ్రమ్ములో ముంచి చంపేసిన విషయం తెలిసిందే. క్రూరమృగంగా వ్యవహరించిన నరేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రావణి బంధువులు, గ్రామస్తులు శుక్రవారం కర్నూలు–పత్తికొండ రహదారిపై దేవనకొండ బస్టాండ్ సమీపంలో ధర్నాకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. దేవనకొండ సీఐ వంశీనాథ్, పోలీసులు నచ్చజెప్పినా ధర్నా విరమించకపోవడంతో చివరకు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాదాపు రెండు గంటలసేపు అక్కడే ఉండి ధర్నాను విరమింపజేశారు. కాగా ఈ సమయంలో పోలీసుల, ఆందోళనకారుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడు చాకలి నరేష్‌పై.. భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ విలేకరులకు తెలిపారు.

● చాకలి నరేష్‌ను కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించ