
● రాం‘జల’ పరవళ్లు
చెరువుల్లో నీరు నిల్వ ఉండటం చూసే ఉంటారు. అయితే ఆదోని పట్టణ సమీపంలోని రాంజల చెరువు నిండి పొంగి ప్రవహిస్తోంది. ఓవర్‌ఫ్లో అయి నీరు ఆవుదూడ వంక మీదుగా వెళ్తున్నాయి. నీరు అధికంగా ఓవర్‌ఫ్లో కావడంతో 2007, 2009లో ఆదోని పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నీరు పోయే విధంగా ఆవుదూడ వంకలో పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఇటీవల ఆస్పరి మండలం చిగిళి గ్రామంలో ఆరుగురు పిల్లలు ఈత నేర్చుకోవడానికి వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. రాంజల చెరువు గట్టు మీద పిల్లలు ఆడకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందే. – ఆదోని సెంట్రల్
చెరువు నుంచి పొంగి పొర్లుతున్న నీళ్లు

● రాం‘జల’ పరవళ్లు