
● సారోళ్లు రాలే!
తాళం వేసి ఉన్న ఈ వార్డు సచివాలయం ఆత్మకూరులోనిది. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈ సచివాలయం (7వ నంబర్) శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలైనా తెరుచుకోలేదు. వివిధ పనుల మీద అక్కడికి వచ్చిన ప్రజలు 10.30 నుంచి నిరీక్షించారు. మధ్యాహ్నమైనా తలుపులు తెరుచుకోకపోవడంతో సారోళ్లు ఎప్పుడొస్తారోనని నిరాశతో వెనుదిరిగారు.సచివాలయం తెరవకపోవడానికి కారణమేమిటో తెలుసుకునేందుకు ‘సాక్షి’ మునిసిపల్ కమిషనర్ రమేష్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. కూటమి సర్కారు వచ్చినప్పుటి నుంచి సచివాలయ వ్యవస్థపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. –ఆత్మకూరు రూరల్
12.30 గంటలైనా
తెరుచుకోని వార్డు సచివాలయం