
గతంలో టీడీపీ నేతల దుశ్చర్య ఇదీ..
ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల భూ కబ్జాలు పెరిగిపోయాయి. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో పవర్‌గ్రిడ్, విండ్ పవర్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి భూ సేకరణ చేస్తున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో 2,500 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 1,500 ఎకరాలు తీసుకున్నారు. విండ్ పవర్ కోసం ఆస్పరి మండలంలో 350 ఎకరాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. పవర్‌గ్రిడ్ కోసం మనేకుర్తి గ్రామంలో 200 ఎకరాలు సేకరించాల్సి ఉంది. టీడీపీ నేతల చౌక బేరానికి రైతులు అడ్డు చెబుతున్నారు.
రంగంలోకి దిగిన అమాత్యుడు!
పవర్‌గ్రిడ్ కోసం మనేకుర్తి గ్రామంలో రెండు వందల ఎకరాల భూములను సేకరిస్తున్నారు. ఇక్కడ మార్కెట్ ధర రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పలుకుతోంది. అయితే ప్రవర్ గ్రిడ్ అధికారులు ఎకరాకు రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు చెల్లి స్తామని చెబుతున్నారు. అయితే రైతులు తమ భూ ములు ఇచ్చేది లేదని చెబుతున్నారు. నిరసనలు, ఆందోళనలు కూడా చేశారు. రైతుల నుంచి ఎలాగైనా భూములు తీసుకోవాలని రెవెన్యూ అధికారులపై టీడీపీకి చెందిన ఒక మంత్రి ఒత్తిడి తీసుకువస్తున్నా రు. అధికారులు చెబుతున్నా భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరించడం లేదు. కొద్ది పాటి భూములను అమ్ముకుంటే జీవనాధారం కోల్పో యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
ప్రలోభాలు ఇలా..
మార్కెట్ ధర ఎకరాకు కేవలం రూ. 6 లక్షలు అని, కోర్టుకు వెళ్లినా అంతే పరిహారం వస్తుందని రైతులకు కొందరు అధికారులు చెబుతున్నారు. మంచి ధర వస్తుందని, భూములను ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వమే తీసుకుంటుందని, పరిహారం కూడా రాదని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
విండ్ పవర్ కోసం 351 ఫ్యాన్లును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం ఎకరాకు రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఇచ్చి టీడీపీ నేతలు 350 ఎకరాల భూములు కొనుగోలు చే శారు. రైతుల వద్ద నుంచి చౌక ధరలకు భూములను కొట్టేశారు. మనేకుర్తి గ్రామంలో భూములను ఇలా కొట్టేయడానికి చూస్తున్నారు. దీంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.