
ప్రశాంతంగా అటవీశాఖ పరీక్షలు
కర్నూలు(సెంట్రల్): అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు 33 కేంద్రాల్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 89.75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 12,919 మంది అభ్యర్థులకుగాను 10,820 మంది హాజరుకాగా 2,099 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించిన సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్టు కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 81.20 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 2,255 మంది అభ్యర్థులకుగాను 1,831మంది హాజరు కాగా 424 మంది గైర్హాజరయ్యారు. కాగా, ఉదయం శంకరాస్ డిగ్రీ కాలేజీలో జరిగిన స్క్రీనింగ్ టెస్టును ఏపీపీఎస్‌సీ జిల్లా కోఆర్డినేటర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.