
6న డోన్‌కు వైఎస్ జగన్ రాక
డోన్: డోన్ పట్టణానికి ఈనెల 6వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి, దివంగత నీలం సంజీవరెడ్డి ముని మనవరాలు అనన్యరెడ్డి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరై నవ దంపతులను ఆశీర్వదించనున్నారు. ఈ మేరకు వివాహ రిసెప్షన్ వేదికతో పాటు వెంకటాపురం రోడ్డులో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి శనివారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, పార్టీ నాయకులు గజేంద్రనాథ్‌రెడ్డి, క్వాలిటీ అబ్దుల్లా, చంద్రశేఖర్ రెడ్డి, దినేష్‌గౌడ్, కురుకుందు హరి, మల్యాల శ్రీనివాసరెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి తదితరులు ఉన్నారు.