
నట్టేట ముంచారు
పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ఎకరాకు రూ.లక్ష చొప్పున పెట్టుబడి అయ్యింది. నేడు పలు కంపెనీలు కొనుగోలు చేస్తున్నా తక్కువ ధరతో రైతులు నట్టేట మునిగిపోవాల్సి వచ్చింది. పొగాకు రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– శ్రీనివాసులు, రైతు, ఉప్పలపాడు,
ఓర్వకల్లు మండలం
చర్యలు తీసుకుంటాం
పొగాకు రైతులందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే రెండు దఫాలుగా కంపెనీలతో సమావేశాలు నిర్వహించాం. మిగిలిపోయిన పొగాకు అగ్రిమెంట్ చేసుకోలేదని కంపెనీలు చెబుతున్నాయి. పొగాకు రైతులకు న్యాయం చేసేందుకు టొబాకో బోర్డుకు, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు లేఖలు రాశాం. త్వరలోనే సమావేశం నిర్వహించి మిగిలిపోయిన పొగాకును కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ నవ్య, జాయింట్ కలెక్టర్, కర్నూలు

నట్టేట ముంచారు