
ఒక్క క్వింటా కూడా కొనలేదు
కంపెనీలను నమ్ముకొని ఆరు ఎకరాల్లో పొగాకు సాగు చేశాం. ఎకరాకు రూ. 75,000 ప్రకారం పెట్టుబడి పెట్టాం. మొత్తంగా 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు ఒక క్వింటా కూడా కొనలేదు. నిల్వ చేయడంతో నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. పొగాకు సాగు చేసి కోలుకోలేని విధంగా నష్టపోయాం. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం చొరువ తీసుకొని పొగాకు రైతులకు న్యాయం చేయాలి.
– శ్రీనివాసులు, పడిదెంపాడు, కర్నూలు మండలం
● రైతుల ఇళ్ల నుంచి కదలని పొగాకు
● ఒప్పందాన్ని అమలు చేయని కంపెనీలు
● స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
● ఉమ్మడి జిల్లాలో 40,950
క్వింటాళ్లకుపైగా మిగిలిపోయిన పొగాకు
● నిల్వలను చూసి గుండెపోటుకు
గురవుతున్న రైతులు