
వైఎస్సార్‌సీపీ టీయూ అధికార ప్రతినిధిగా సురేష్
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం ట్రేడ్ యూనియన్ (టీయూ) రాష్ట్ర అధికార ప్రతినిధిగా కర్నూలు నగరానికి చెందిన కటారి సురేష్ నియమితులయ్యారు. అలాగే ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వి.కె.జయపాల్ (ఆదోని), క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కదిరికోట విక్టర్ ఇమ్మానుయేల్ (కర్నూలు)లను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
మంత్రాలయం తుంగా తీరంలో షవర్లు
మంత్రాలయం: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల నదీ ప్రవాహంలో కర్ణాటక రాష్ట్రం అర్షికేరి మండలానిక చెందిన ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీమఠం, ప్రభుత్వాధికారులు మేల్కొన్నారు. ప్రమాద ఘంటికలు పొంచి ఉండటంతో భక్తుల నదీ స్నానాలకు బ్రేకులు వేశారు. నదిలోకి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు. స్నానపు ఘాట్‌తో రెండు విభాగాలుగా షవర్లను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా స్నానాలు ఆచరించేలా షవర్ల సముదాయాన్ని నెలకొల్పారు. ప్రత్యేక విద్యుత్ మోటార్ల ద్వారా షవర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. తీరం పొడవునా పోలీసులు, సెక్యురిటీ గార్డ్స్‌ను పహారాగా పెట్టారు. నదిలోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు శ్రీమఠం మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ టీయూ అధికార ప్రతినిధిగా సురేష్