కళ్లు ‘బేళ్లు’ కమ్ముతున్నా.. కనికరం లేదు! | - | Sakshi
Sakshi News home page

కళ్లు ‘బేళ్లు’ కమ్ముతున్నా.. కనికరం లేదు!

Jul 18 2025 1:15 PM | Updated on Jul 18 2025 1:15 PM

కళ్లు

కళ్లు ‘బేళ్లు’ కమ్ముతున్నా.. కనికరం లేదు!

ఒప్పందాన్ని మట్టిలో కలిపేసిన

పొగాకు కంపెనీలు

అమ్ముకోలేక రైతుల ఇళ్ల ముంగిట

దిగుబడులు

మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని

డిమాండ్‌

పాలకులకు పట్టని అన్నదాత కష్టాలు

కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమవుతోంది. వరి, పత్తి, మిరప రైతులు నష్టాలకే దిగుబడులు అమ్మేసుకున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దిగుబడులను దళారుల చేతిలో పెట్టి మోసపోతున్నారు. జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యేలు, ఎంపీ పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సత్వరమే పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ఎమ్మెల్యేలు, ఎంపీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పొగాకు రైతులు కుదేలవుతున్నారు. కంపెనీల చేతిలో మోసపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అదిగో.. ఇదిగో అంటూ కాలపయాన చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న తమకేమీ పట్టనట్లు పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక.. దిగుబడిని నిల్వ చేసుకోలేక దిగాలు చెందుతున్నారు. నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందిన రైతాంగానికి ఇప్పటికీ ఆదోని, కర్నూలు మార్కెట్‌లే పెద్ద దిక్కుగా నిలిచాయి. జిల్లాలో పండించే వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు, పత్తి, కంది తదితర పంటలు సైతం ఈ ప్రాంత వ్యాపారులు, దళారులు కొనుగోలు చేయపోతే నేరుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తరలించి ధాన్యాన్ని విక్రయిస్తారు. పత్తి దిగుబడిని ఆదోని మార్కెట్‌యార్డుకు తరలిస్తారు. జిల్లా కేంద్రం నంద్యాలలో ప్రధాన పంటల మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో గతేడాది మధ్య పంటగా పొగాకును రైతులు విస్తారంగా సాగు చేశారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పండించారు. ప్రధానంగా ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో దాదాపు 25 మండలాల్లో పొగాకును సాగుచేశారు. అయితే ఇక్కడ పొగాకు కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల పొగాకు కంపెనీలే రైతులకు దిక్కు అయ్యాయి. అయితే సాగుకు ముందు ఒప్పందం చేసుకున్న కంపెనీలు మోసం చేయడంతో నష్టాలు మూటగట్టుకున్నారు. ప్రధానంగా జీపీఐ, అలియన్స్‌ ఈ కంపెనీలు క్వింటా రూ.15 వేలు దాకా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి చివరకు అరకొరగా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఉన్నఫలంగా చేతులెత్తేశాయి. ఇక రైతులు ఏమి చేయలేక ఇళ్లు, కల్లాల్లో పొగాకు బేళ్లను నిల్వ ఉంచారు. దీనికితోడు ఏప్రిల్‌, మే నెలలో వర్షాలు కురవడంతో పొగాకు దెబ్బతింది. రైతులు రూ. లక్షలు నష్టపోయారు. గుంటూరు తరహాలో నంద్యాలలో కూడా పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే నేరుగా అక్కడికి తరలించి విక్రయించే అవకాశం ఉండేదని చెబుతున్నారు.

కళ్లేదుట నిల్వలు..

కంపెనీలు మోసం చేయడంతో ఇప్పటికీ కొందరు రైతుల వద్ద 30 నుంచి వంద క్వింటాళ్ల దాకా పొగాకు నిల్వలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఒక్క కరివేన గ్రామంలోనే దినకర్‌ 100 క్వింటాళ్లు, గౌతం 150, ఎల్లారెడ్డి 150, శేషయ్య 60, సుదర్శన్‌ 65, రవి 50, కుమ్మరి రవీంద్ర 70, పాపన్న వంద, మద్దిలేటి 100, కురువ శీన 50, పి.నాగేంద్రుడు 100, రమణ, మల్లయ్యల వద్ద వంద క్వింటాళ్ల దాకా పొగాకు నిల్వలు ఉన్నాయి. పొగాకును అమ్ముకోలేక, ఇళ్లలో దాచుకోలేక రైతుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఓ వైపు కళ్ల ముందు విలువైన పంట.. మరోవైపు వేధిస్తున్న అప్పుల భారంతో సతమతమవుతున్నారు.

ఎమ్మెల్యేలు, ఎంపీకి

రైతుల సమస్య పట్టదా?

కళ్లు ‘బేళ్లు’ కమ్ముతున్నా.. కనికరం లేదు!1
1/1

కళ్లు ‘బేళ్లు’ కమ్ముతున్నా.. కనికరం లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement