
క్రీడాభివృద్ధికి సహకారం
కర్నూలు (టౌన్): క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి ఆట్యా–పాట్యా ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు జిల్లాలో క్రీడలకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు త్వరలో ఒంగోలు పట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. పోటీల్లో విజేతలుగా పెండేకంటి ఇంగ్లిష్ మీడియం స్కూల్ (ప్రథమ స్థానం), ఓర్వకల్లు ఏపీ మోడల్ స్కూల్ (రెండవ స్థానం), కేశవరెడ్డి స్కూల్ (మూడవ స్థానం), బాలికల విభాగంలో ఓర్వకల్లు కస్తూర్బా గాంధీ విద్యాలయం (మొదటి స్థానం)మంత్రాలయం కస్తూర్బా గాంధీ విద్యాలయం (రెండవ స్థానం), తుగ్గలి కస్తూర్బా గాంధీ విద్యాలయం (మూడవ స్థానం) నిలవడంతో వారికి మొమెంటోలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు.