
త్వరలో రెండో విడత నాబార్డు పనులు
నాబార్డు ద్వారా 2వ విడత కూడా పనులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున ప్రస్తుతం రూ.3 కోట్ల పైచిలుకు విలువ చేసే పనులకు ఆమోదం లభించింది. ఈ పనులకు టెండర్లు పిలవడం పూర్తయింది. పనులు కూడా పలు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ వారోత్సవాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అంతర్గత రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు ఈ నెలలో కర్నూలు జిల్లాలో దాదాపు రూ.26 కోట్ల మేర విడుదలయ్యాయి. మిగిలిన బిల్లులను కూడా నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉంది.
– వి.రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్‌ఈ
●