
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది చెప్పారు. మధ్యవర్తిత్వంతో కేసులకు త్వరితగతిన పరిష్కారం లభిచడంతో పాటు సమయం, డబ్బు వృథా కావన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో ప్రజల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేందుకు వన్ కే ర్యాలీని నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగిన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి దివాకర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి, బార్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, మీడియేషన్ శిక్షణ పొందిన న్యాయవాదులు నాగశేషయ్య, ఆశాబాయి, యూ.లక్ష్మి, ఉమాదేవి పాల్గొన్నారు.