
వైఎస్సార్‌సీపీలో చేరిక
ఆదోని టౌన్: మండలంలోని పెద్దతుంబళం గ్రామం నుంచి దాదాపు 50 కుటుంబాల వారు మంగళవారం స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. నాయకులు హుసేన్‌పీరా, షేక్‌అహ్మద్ రఫిక్ ఆధ్వర్యంలో జాకీర్, జహీర్, అబ్దుల్‌అజ్పూర్, షేక్షావలి, ఫిరోజ్, ఖాజా, జాఫర్, అన్వర్, బుడ్డా కాశీం, మహమ్మద్‌బాషా, ఖాదర్, ఫిరోజ్‌తో పాటు మరికొంతమంది పార్టీలో చేరగా వారికి ఆదోని వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ పార్టీతో సంబంధం లేని యువత ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్‌సీపీలో చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలను చూసి ప్రతిఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పుడు హామీలను ఇచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బి.దేవా, మండల యూత్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కేశవరాయుడు, రహమాన్, ఫయాజ్, చిన్న ఈరన్న, బీమా, సాంబ, వీరంజి తదితరులు పాల్గొన్నారు.