కర్ణాటక మద్యం అక్రమ రవాణా జరిగితే వేటు | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక మద్యం అక్రమ రవాణా జరిగితే వేటు

May 24 2025 1:28 AM | Updated on May 24 2025 1:28 AM

కర్ణాటక మద్యం అక్రమ రవాణా జరిగితే వేటు

కర్ణాటక మద్యం అక్రమ రవాణా జరిగితే వేటు

ఆలూరు: ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక మద్యం రవాణా, అమ్మకాలు జరిగితే వేటు తప్పదని జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, సిబ్బందిని ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆలూరు ఎకై ్సజ్‌ స్టేషన్‌లో ఎకై ్సజ్‌ డిప్యూటీ కమీషనర్‌ శ్రీదేవి సమక్షంలో అధికార సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల్లో అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎకై ్సజ్‌ సిబ్బందిపై ఉందన్నారు. ప్రధానంగా చెక్‌పోస్టులో సీసీ కెమెరాలు నిరంతం పనిచేసేలా చూడాలన్నారు. వాహనాల తనిఖీ చేపడుతూ, అడ్డ రహదారులపై నిఘా వేసి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మద్యం షాపులలో ఎంఆర్‌పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. హాలహర్వి మండలం క్షేత్రగుడి ఎకై ్సజ్‌ చెక్‌ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఆయన వెంట జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణ, డీటీఎఫ్‌ సీఐ రాజేంద్రప్రసాద్‌, ఆలూరు ఎకై ్సజ్‌ సీఐ లలితాదేవి, ఎస్‌ఐ నవీన్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.

మహా ‘నందీశ్వరుడి’కి నేడు ప్రదోషకాల అభిషేకం

మహానంది: మహానందిలో శనివారం బహుళ త్రయోదశి, మహా ప్రదోష కాలం సందర్భంగా నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో సాయంత్రం 4–00 గంటల నుంచి ప్రదోష కాల నందీశ్వర అభిషేకం జరుగనుంది. ప్రదోష కాల నందీశ్వర అభిషేక సేవలో పాల్గొనాల్సిన వారు, మధ్యాహ్నం 3–30కి ఆర్జిత సేవా టికెట్‌ తీసుకుని ఆలయంలో ఉండాలని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్‌ అవధాని విజ్ఞప్తి చేశారు.

డీసీసీబీ సీఈఓగా

రామాంజనేయులు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌, డీసీసీబీ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి నవ్య ఫైల్‌పై సంతకం చేసినట్లు సమాచారం. ఇంతవరకు సీఈఓగా ఉన్న విజయ్‌కుమార్‌ ఆప్కాబ్‌కు వెళ్లనున్నారు. విజయ్‌కుమార్‌ ఆప్కాబ్‌లో డీజీఎం. డిప్యూటేషన్‌పై డీసీసీబీలో ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు. సీఈఓ పోస్టు ఖాళీ కావడంతో గత ఏడాది జనవరి నుంచి పూర్తి బాధ్యతలతో కొనసాగుతున్నారు. ఈయన ఆప్కాబ్‌కు వెళ్లనుండటంతో ఆ స్థానంలో జనరల్‌ మేనేజర్‌ అయిన రామాంజనేయులు నియమితులైనట్లు సమాచారం. ఈయన 20 నెలల క్రితం వరకు సీఈఓగా దాదాపు ఎనిమిదేళ్లు పనిచేశారు. మళ్లీ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షల్లో శుక్రవారం ఇద్దరు విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండటంతో గుర్తించి డిబార్‌ చేశారు. మొత్తం 7112 మంది విద్యార్థులకు గాను 6414 మంది పరీక్షలకు హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు శుక్రవారం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement