
తాగునీటి ఎద్దడిని నివారించండి
హొళగుంద: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ మల్లికార్జునయ్య, ఏఈ రామ్‌లీలకు సూచించారు. శుక్రవారం హొళగుందకు చేరుకున్న వారికి గ్రామస్తులు నీటి సమస్యను వివరించారు. కడ్లమాగి వద్ద ఉన్న మంచినీటి పథకం నుంచి గ్రామంలోని ఫిల్టర్‌బెడ్‌కు నీరు సక్రమంగా సరఫరా కాకపోవడం, గ్రామ జనాభాకు తగ్గట్టు సంప్, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు లేకపోవడం, పైప్‌లైన్ సమస్య తదితర కారణాలతో నీటి సమస్య నెలకొందని వారి దృష్టికి తీసుకెళ్లారు. వారానికో సారి నీరు రావడం గగనమైందని, వచ్చినా బోరు నుంచి వదిలే ఉప్పు నీరే వస్తుందని వాపోయారు. 30 వేలకు పైగా జనాభా ఉన్న హొళగుందలో రోజూ నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. పక్కనే ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ మల్లికార్జునయ్య, ఏఈ రామ్‌లీల, ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్వహణ కాంట్రాక్టర్ సుంకన్నను జెడ్పీ చైర్మన్ విచారించగా ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు పుష్కలంగా ఉన్నాయని అయితే పథకం వద్ద తరుచూ విద్యుత్ అంతరాయం కలుగుతుండడంతో, నీటి నిల్వలకు సరైన ట్యాంకులు లేకపోవడంతో నీటి సమస్య తలెత్తుందని వివ రించారు. అదనంగా సంప్, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకు, పైప్‌లైన్‌కు గాను దాదాపు రూ. 15 పుంచి 20 లక్షలు అవసరం అవుతాయని ఆ నిధులను సమకూర్చాలని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ షఫివుల్లాతో పాటు నాయకులు, ఎంపీటీసీలు ఈశా, పంపాపతి, కెంచప్ప, రామకృష్ణ, మల్లయ్య, హను మప్ప, శివన్న, షేక్షావలి తదితరులు జెడ్పీ చైర్మన్ విన్నవించారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వారు పక్కనే ఉన్న ఫిల్టర్‌బెడ్, సంప్‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపా ధ్యక్షుడు ఎస్కే గిరి, కో కన్వీనర్ లక్ష్యన్న, సిందువాళ కృష్ణయ్య, గోవిందు, మంజునాయక్ పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి