
ప్రజలను మోసం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఆరితేరింది. ఎన్న
తుగ్గలి: రహదారులను మెరిపిస్తామంటూ ఆర్భాటంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే చేతులెత్తేసింది. స్థానిక నాయకుల జేబులు నింపేందుకు గుంతలు పూడ్చే పనిని ఆగమేఘాల మీద చేపట్టింది. ఆకలి మీద ఉన్న కూటమి స్థానిక నేతలు.. అవకాశం చిక్కినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ౖపైపె మెరుగులతో మమ అనిపించారు. ఈ పనుల్లో నాణ్యత మూడు నెలలకే తేలిపోయింది. ఇప్పుడు అడుగుకో గుంత ప్రజలకు స్వాగతం పలుకుతోంది. కిలోమీటరు ప్రయాణం కూడా నరకాన్ని తలపిస్తోంది. ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలంటే కిందామీదా పడక తప్పని పరిస్థితి. పత్తికొండ–గుత్తి ప్రధాన రహదారిలో ప్రజల అవస్థలు చూస్తే కూటమి ప్రభుత్వ మోసం కళ్లకు కడుతుంది. మంత్రాలయం పుణ్య క్షేత్రానికి.. ఆదోని, గుత్తికి 25 కిలోమీటర్ల ఈ రహదారి మీదుగానే రాకపోకలు సాగుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు తిరిగే దారి దీనావస్థ చూస్తే టీడీపీ నేతలు, పచ్చ పత్రికలు గత ప్రభుత్వంపై ఏస్థాయిలో అవాస్తవాలను వండి వర్చారో అర్థమవుతోంది. పత్తికొండ–గుత్తి రోడ్డు మరమ్మతులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఐదు నెలల క్రితం రూ.13లక్షలు మంజూరు చేసింది. కంటి తుడుపు చర్యగా ౖపైపె పూతతో సరిపుచ్చారు. పట్టుమని మూడు నెలలు కూడా గడవలేదు. అంతలోనే పూడ్చిన గుంతలు మళ్లీ పుట్టుకొచ్చాయి. గుంతలు పెద్దవిగా ఉండడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులకు లోతు తెలియక నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ దారి మొత్తం తారు లేచిపోయి గుంతలే దర్శనమిస్తుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రమాదంతో కలిసి ప్రయాణం చేస్తుండటం గమనార్హం.