
పులి దాడిలో ఆవు మృతి
వెలుగోడు: పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలో ఉన్న గట్టు తండాకు చెందిన శివనాయక్ మద్రాస్ మెయిన్ కెనాల్ సమీపంలో ఉన్న పంట పొలంలో ఆవుల మందును నిల్వ ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున మందపై పులి దాడి చేసి ఒక ఆవును చంపేసినట్లు బాధితుడు వాపోయాడు. ఆవు మృతితో రూ.50 వేల నష్టం వాటిల్లిందన్నాడు.
పశు గ్రాసం దగ్ధం
రుద్రవరం: మండల పరిధిలోని తువ్వపల్లె గ్రామ సమీపంలో సోమవారం విద్యుత్ ప్రమాదంలో ట్రాక్టర్‌పై తరలిస్తున్న పశుగ్రాసం దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రెడ్డిపల్లెకు చెందిన రైతు చిన్నక్రిష్ణయ్య తువ్వపల్లె సమీపంలోని రంగాపురం బావి వద్ద మరో రైతు నుంచి గ్రాసం కొనుగోలు చేసి ట్రాక్టర్‌లో లోడ్ చేసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకి నిప్పులు చెలరేగడంతో గ్రాసానికి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై లిఫ్ట్ ద్వారా గ్రాసాన్ని కిందకు తోసేయడంతో ట్రాక్టర్‌కు ఎలాంటి నష్టం కలగలేదు. కానీ గ్రాసం పూర్తిగా కాలిపోవడంతో రైతుకు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఆస్తి కోసం మేనత్తపై కత్తితో దాడి
బొమ్మలసత్రం: మేనత్తకు చెందిన ఆస్తిని రాసివ్వటం లేదని సొంత మేనల్లుడే కత్తితో దాడికి పాల్పడిన ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు.. నూనెపల్లిలో నివాసముంటున్న షేక్‌రహమున్నిసాకు అక్కడే రెండు భవనాలున్నాయి. ఆమె అన్న కుమారుడు అబ్దుల్‌రహమాన్ పనిపాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. ఈక్రమంలో ఒక ఇంటిని తన పేరుమీద రాసివ్వాలని మేనత్తను ఒత్తిడికి గురిచేసేవాడు. ఈనేపథ్యంలో రైల్వేస్టేషన్ సమీపంలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న రహమున్నిసాపై మేనల్లుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. త్రీటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.

పులి దాడిలో ఆవు మృతి

పులి దాడిలో ఆవు మృతి