ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలమూర్తులను సోమవారం ఉదయం సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనంపై మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువైన జ్వాలా నరసింహస్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.