
పోలీసులకు పట్టుబడి
మంత్రాలయం నియోజకవర్గం నుంచి టిప్పర్లతో కర్ణాటకలోని రాయచూరు, తెలంగాణలోని హైదరాబాద్, గద్వాల, జడ్చర్ల, పాలమూరు ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర టిప్పర్లను కర్ణాటక పోలీసుల చేతికి పట్టుబడ్డాయి. గత నెల 28న ఐదు టిప్పర్లను సీజ్ చేశారు. మంత్రాలయం సరిహద్దు గ్రామం మాధవరం చెక్‌పోస్టు నుంచి కర్ణాటక వైపుగా ఈ టిప్పర్లు తరలిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని ఎరిగేర సర్కిల్ ఠాణాలో టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. మాధవరం చెక్‌పోస్టు దాటుతుండగా ఇసుక ఎక్కడి నుంచి తెచ్చారని కొందరు అడుగగా మరళి రీచ్ నుంచి తెచ్చినట్లు చెప్పారు. టీడీపీ నేతల అండతోనే ఈ దందా సాగిపోతున్నట్లు తెలుస్తోంది.