
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులు ‘క్షీ
పాల ఉత్పత్తి తగ్గింది
మాకు 14 ముర్రా గేదెలు ఉన్నాయి. అన్నీ పాలు ఇస్తాయి. డిసెంబరులో రోజుకు 90 నుంచి 100 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అయ్యేవి. ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. రోజుకు 50 నుంచి 55 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దాణా ఖర్చులు పెరిగాయి. వేసవిలో పచ్చిమేత తగినంత లేదు. నీటి సమస్య, ఎండల తీవ్రతతో పాల ఉత్పత్తి బాగా తగ్గింది. వర్షాలు కురిసి పచ్చి మేత అందుబాటులోకి వస్తే ఆగష్టు నుంచి పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.
– వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్,
మల్లెపల్లి, వెల్దుర్తి మండలం
త్వరలో దాణామృతం ఇస్తాం
వేసవిలో పాల ఉత్పత్తి 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో జిల్లాకు 250 టన్నుల సమీకృత దాణాను ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే పాడి రైతులకు సరఫరా చేస్తాం. పశుగ్రాసాల సాగుకు గడ్డి విత్తనాలను కూడా సబ్సిడీపై ఇస్తాం. వేసవిలో పశువుల కోసం ఉపాధి నిధులతో గ్రామాల్లో నీటితొట్లు కూడా ఏర్పాటు చేయనున్నాం.
– డాక్టర్ జి.శ్రీనివాస్,
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
ఉమ్మడి జిల్లాలో ‘క్షీర’ క్షోభం
● వేసవిలో తగ్గిపోయిన పాల ఉత్పత్తి
● రోజుకు 13 లక్షల లీటర్లు అవసరం
● లభించేది 5 లక్షల లీటర్లు మాత్రమే
● ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి
దిగుమతి
కర్నూలు(అగ్రికల్చర్): అసలే వేసవి కాలం.. ఒక వైపు పచ్చిమేత కొరత.. మరోవైపు నీటి సమస్య.. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అంటూ హడావుడి చేసినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 250 ఎంఎల్ పాలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 52 లక్షల జనాభా ఉంది. వీరి ప్రతి రోజూ 13 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అన్ని పాలు అందుబాటులో లేవు.
నీరు లేదు.. పచ్చిమేత కరువు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,55,747 పశువులు ఉన్నాయి. వీటిలో 1,61,228 ఆవులు, గేదెల నుంచి మాత్రమే పాల దిగుబడి ఉంది. మిగిలినవి చూలు(ప్రెగ్నెంట్)తో, గొడ్డుబోతు పశువులుగా ఉన్నాయి. ఆగస్టు నుంచి జనవరి వరకు పచ్చిమేత నీరు పుష్కలంగా ఉండటంతో 10 లక్షల పాలు ఉత్పత్తి అయ్యేవి. కరువు పరిస్థితుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం పశువులకు పచ్చి మేత లేదు.. నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. దీంతో వేసవిలో పాల దిగుబడి 50 శాతానికి పైగా పడిపోయింది. కేవలం 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.
పాలపొడికి డిమాండ్
డెయిరీల్లో వెన్న పూర్తి తీసి పాలపొడి తయారు చేస్తారు. పాల కొరత ఉన్నసమయంలో పాల పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. పాలపొడితో టోన్డ్ మిల్క్ తయారు అవుతాయి. టోన్డ్ మిల్క్‌లో వెన్న 3 శాతం ఉంటుంది. గేదె పాలల్లో వెన్న 6.50 శాతం నుంచి 8 శాతం ఉంటుంది. ఆరు శాతంపైన ఉన్న వెన్నను తీసి 6 శాతం వెన్నతో గోల్డ్ మిల్క్ తయారు చేస్తారు. పాల పొడిపాలల్లో వెన్న ఉండదు. 50 శాతం పాలపొడి పాలు, మరో 50 శాతం 6 శాతం వెన్న ఉన్న పాలు కలిపితే మొత్తంగా పాలల్లో వెన్న మూడు శాతం ఉన్నట్లు అవుతోంది. వీటితో టోన్డ్ మిల్క్ ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న టోన్డ్‌మిల్క్ పాలు పాలపొడితో తయారు చేసినవేనని స్పష్టమవుతోంది.
ఉత్తుత్తి హడావుడే
వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాణామృతం (టీఎంఆర్), సమీకృత దాణా వంటి వాటిని సరఫరా చేయాలి. అయితే దాణామృతం లేదు.. దాణా సరఫరా లేకుండా పోయింది. ‘ఉపాధి’ నిధులతో ఊరూర పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు అంటూ హడావుడి చేసింది.. ఇంతవరకు కార్యరూపమే దాల్చలేదు. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు భూమిలో ఉపాధి నిధులతో పశుగ్రాసక్షేత్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 600 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుకు అనుమతులు లభించాయి. కాని ఒక్క సెంటులో పశుగ్రాస క్షేత్రం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. వేసవిలో పశువుల దాహర్తి తీర్చేందుకు ఉపాధి నిధులతో ఇదుగో నీటితొట్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఆచరణలో సాద్యం కాలేదు. అక్కడక్కడ నీటితొట్లు నిర్మించినప్పటికీ వాటిని నీటితో నింపే వారు కరువయ్యారు. రైతుల చేతికి పంటలే చేతికి అందలేదు. దీంతో రైతులు పాడిగేదెలకు మేతను సర్దుబాటు చేయలేక కబేళాలకు తరలిస్తున్నారు.
దిగుమతి ఇలా..
ఉత్పత్తి తగ్గిపోవడంతో డెయిరీ నిర్వాహకులు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని ప్రయివేటు డెయిరీలు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మరికొన్ని డెయిరీలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఆశ్రయించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 లక్షల కుటుంబాలు ఉండగా... దాదాపు 40 శాతం కుటుంబాలు లూజు పాలు వినియోగిస్తున్నాయి. 60 శాతం కుటుంబాలు ప్యాకెట్ పాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు గ్రామాల్లో పశుసంపద తగ్గిపోయింది. గ్రామాల్లో కూడా ప్యాకెట్ పాలే వినియోగిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులు ‘క్షీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులు ‘క్షీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులు ‘క్షీ