
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస
కోడుమూరు మండలం
పులకుర్తి గ్రామ సచివాలయం
● మారిన గ్రామ, వార్డు సచివాలయ
ఉద్యోగుల పనితీరు
● టెక్నికల్, జనరల్ ఫంక్షనీర్స్‌గా
ఉద్యోగుల విభజన
● పలువురికి తప్పని స్థాన చలనం
● రెండు, మూడు సచివాలయాలకు
ఒకరు పనిచేసేలా చర్యలు
● వైఎస్సార్‌సీసీ హయాంలో
జిల్లాలో 672 సచివాలయాలు
● నేడు 350కి కుదించిన
రాష్ట్ర ప్రభుత్వం
టెక్నికల్ ఫంక్షనీర్స్ ఎంత మంది ఉన్నారంటే...
వీఆర్‌ఓ 106
సర్వే అసిస్టెంట్ 411
అగ్రికల్చర్ అసిస్టెంట్ 230
హార్టికల్చర్ అసిస్టెంట్ 114
ఫిషరీస్ అసిస్టెంట్ 08
ఏఎన్‌ఎం 280
ఇంజినీరింగ్ అసిస్టెంట్ 359
అనిమల్ హజ్‌బెండరీ అసిస్టెంట్ 159
సెరికల్చర్ అసిస్టెంట్ 178
మహిళా పోలీస్ 373
ఉద్యోగుల విభజన ఇలా..
ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను టెక్నికల్, జనరల్ ఫంక్షనీర్స్ అంటు రెండు విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ ప్రక్రియకు మార్గదర్శకాలు విడుదలైన వెంటనే ముందుగా టెక్నికల్ ఫంక్షనీర్స్‌గా గుర్తించిన ఉద్యోగులు ఒక్కొక్కరు రెండు లేక మూడు సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా కేటగిరీలకు చెందిన మిగిలిన ఉద్యోగులను ఖాళీగా ఉన్న ప్రాంతాలకు లేదా ఇతర శాఖలకు బదిలీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.