
కర్ణాటక మద్యం స్వాధీనం
డోన్ రూరల్: అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం సీఐ వరలక్ష్మి కేసు వివరాలను వెల్లడించారు. అందిన సమాచారం మేరకు కొచ్చెర్వు గ్రామంలో దాడి చేయగా గ్రామానికి చెందిన మేకల లక్ష్మన్న, వడ్డే శ్రీనివాసులు అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుంచి 192 కర్ణాటక మద్యం సీసాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో ఎస్‌ఐలు సోమశేఖర్‌రావు, దౌలత్‌ఖాన్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సుధాకర్‌రెడ్డి, గోపాల్, భషీర్, ఉమాకాంత్‌రెడ్డి, చెన్నకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
బీరుసీసాతో దాడి
మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని వైన్‌షాపు వద్ద ఉన్న ఓ దుకాణంలో బుధవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. అబ్బీపురం గ్రామానికి చెందిన యువకుడు దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసి రూ.30 ఫోన్ పే చేశాడు. అయితే ఓ నంబరుకు పంపించబోయి మరో నెంబరుకు పంపించాడు. దీంతో తనకు డబ్బు రాలేదని దుకాణం యజమాని చెప్పడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు బీరుసీసాతో దుకాణం యజమానిపై దాడి చేయడంతో స్వల్పగాయమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు.