
కుక్కను తప్పించబోయి..
కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన మండ్ల పరుశురాముడు (26) కర్నూలు నగరంలోని సాయికృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో నివాసముంటాడు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాదు వైపు నుంచి కర్నూలులోకి వచ్చే సర్వీసు రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వెనుక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై స్నేహితుడు ఎల్లా నాయుడుతో కలసి వస్తూ ఆంజనేయస్వామి గుడి వద్ద అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డాడు. బైక్ నడుపుతున్న పరుశురాముడు తలకు బలమైన గాయం కావడంతో అ క్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న ఎల్లా నాయుడుకు స్వ ల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరుశురాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి