
అభ్యుదయవాది బసవేశ్వరుడు
కర్నూలు కల్చరల్: సమాజంలో కుల, వర్ణ, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్, వీరశైవ, జంగమ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో మహాత్మా బసవేశ్వరుని పేరుతో ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షిందగ్గ విషయమన్నారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, వీరశైవ ఐక్య సంఘం అధ్యక్షులు ఏజీ మల్లికార్జునప్ప, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప, సభ్యులు విశ్వేశ్వరయ్య, శివరాజ్, యాగంటయ్య, శెట్టి వీర శేఖరప్ప, జంగమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.