
వైభవంగా అక్షయ తృతీయ వేడుక
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర అక్షయ తృతీయ వేడుక వైభవంగా నిర్వహించారు. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి గంధ లేపనం గావించి విశేష పూజలు కానిచ్చారు. రెండు గంటల పాటు వేద మంత్రోచ్ఛారణలతో పూజోత్సవాలు నిర్వహించారు. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
వైఎస్సార్‌సీపీ విభాగ కమిటీలో కర్నూలు వాసులు
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో కర్నూలుకు చెందిన పలువురికి పదవులు దక్కాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఎం.రాజేశ్వరరెడ్డి, కార్యదర్శులుగా దండు లక్ష్మీకాంతరెడ్డి, షేక్ యూనుస్ బాషా, సంయుక్త కార్యదర్శిగా సందీప్ రెడ్డిలను నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.