
మాట్లాడుతున్న కలెక్టర్ సృజన
కర్నూలు (అర్బన్): అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని బీఎల్‌ఓలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశించారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు ఉందో లేదో పరిశీలించాలన్నారు. లేకపోతే వారితో ఫార్మ్ 8 తీసుకోవాలని సూచించారు. ఏఈఆర్వోలు, ఈఆర్వోలు అన్ని పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లు 2 కిలోమీటర్లకు పైగా ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆడుదాం ఆంధ్రా కర్నూలు అర్బన్, హాలహర్వి, కోడుమూరు, పెద్దకడుబూరు, కోసిగి మండలాల్లో రిజిస్ట్రేషన్లు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. సచివాలయం సిబ్బంది, వలంటీర్ల ద్వారా క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు కల్పించాలన్నారు. వెల్దుర్తి మండల సర్వేయర్ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంతో చర్యలు తీసుకోవాలని ఏడీ సర్వేయర్‌ని ఆదేశించారు. హౌసింగ్‌కి సంబంధించి మండల వారీగాలక్ష్యాలను కేటాయించామని, ప్రగతిపై నివేదిక రూపొందించాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ.. రీసర్వేలో భాగంగా 24 వేల స్టోన్ ప్లాంటేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూహక్కు పత్రాల పంపిణీ బుధవారం నాటికి పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో మధుసూదన్‌రావు, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, డ్వామా పీడీ అమరనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ సిద్ధలింగమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన