శ్రీగిరికి పోటెత్తిన భక్తజనం | Sakshi
Sakshi News home page

శ్రీగిరికి పోటెత్తిన భక్తజనం

Published Mon, Dec 4 2023 1:48 AM

భక్తులతో నిండిన క్యూ కంపార్ట్‌మెంట్‌  - Sakshi

శ్రీశైలంటెంపుల్‌:కార్తీకమాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువజామునే పుణ్యస్నానాలాచరించిన భక్తులు కార్తీకదీపారాధన, ప్రత్యేక నోము లు నోచుకుని మల్లన్న దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది.భక్తుల రద్దీతో ఆలయ శ్రీఘ్ర, అతీ శీఘ్ర దర్శన క్యూలన్నీ నిండిపోయాయి. భక్తులందరి కీ స్వామివారి సౌకర్యవంతమైన దర్శనం కలిగేలా స్వామివారి అలంకార దర్శనాన్ని మాత్రమే భక్తులకు కల్పించారు. ఆలయ క్యూలైన్లలో వేచి ఉన్నభక్తులకు అల్పాహారం, తాగునీరు, వేడిపాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు.దేవస్థానం ఈఓ డి.పెద్దిరాజు దర్శన క్యూలైన్ల ను, ఆర్జిత సేవా క్యూలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. భక్తులందరు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. అన్నదాన భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ,సాయంత్రం 6.30 గంటల నుంచి అల్పాహా రం భక్తులకు అందజేశారు.

నేడు లక్షదీపోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మూడవ సోమవారం పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవ కార్యక్రమం, పుష్కరిణికి దశ విధహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉభయదేవాలయాల ప్రధాన అర్చకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శాస్త్రోక్తంగా హారతులిస్తారు.

కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు
1/1

కార్తీక దీపాలను వెలిగిస్తున్న భక్తులు

Advertisement
 
Advertisement