ప్రేమించలేదంటూ.. యువతిపై కిరాతకంగా దాడి.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదంటూ.. యువతిపై కిరాతకంగా దాడి..

Oct 27 2023 1:40 AM | Updated on Oct 27 2023 1:24 PM

- - Sakshi

సాక్షి, కర్నూలు: ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని బైపాస్‌ రోడ్డ్‌ అన్నమయ్య సర్కిల్‌ వద్ద బైక్‌పై వెళ్తున్న యువతి, ఆమె తల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలివీ.. పట్టణంలోని లక్ష్మణ్‌ థియేటర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి ఎర్రకోట సెయింట్‌ జాన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలో రెండవ సంవత్సరం బీటెక్‌ చదువుతోంది. గత కొంత కాలంగా పెద్దకడుబూరు మండలం గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన చిరంజీవి ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. బంధువుల పెళ్లి ఉండటంతో గురువారం సాయంత్రం ఆ యువతితో తన తల్లితో కలిసి చీరలు కొనుగోలు చేసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు.

విషయం తెలుసుకున్న చిరంజీవి అన్నమయ్య సర్కిల్‌లో కాపుకాసి బైక్‌పై వెళ్తున్న యువతి తలపై రాయితో దాడి చేయడంతో కిందపడిపోయింది. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయబోగా తల్లి రావడంతో ఆమెపైనా దాడికి తెగబడ్డాడు. స్థానికులు అడ్డుకోబోగా వారిపైనా దూకుడుగా వ్యవహరించడంతో అందరూ కలిసి దేహశుద్ధి చేశారు. దాడిలో గాయపడిన తల్లీకూతుళ్లను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల దాడిలో గాయపడిన చిరంజీవిని సైతం అదే ఆసుపత్రిలో చేర్చారు. ఘటనపై ఎస్‌ఐ మస్తాన్‌వలి స్పందిస్తూ అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిరంజీవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement