పాణ్యం: నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ రెసిడెన్షియల్ బాల, బాలుర పాఠశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ జయమ్మ శుక్రవారం తెలిపారు. పాణ్యం మండలం నెరవాడ మెట్ట బీసీ బాలికల పాఠశాలలో 6వ తరగతిలో బీసీ–1, ఎస్సీ–1, 7వ తరగతిలో బీసీ ఈ–1 ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆళ్లగడ్డ బాలికల పాఠశాలలో 6వ తరగతిలో బీసీ డీ –02, ఎస్సీ– 03, 7వ తరగతిలో బీసీ బీ–1, ఎనిమిదవ తరగతిలో బీసీ ఏ –02, బీసీ బీ– 01, బీసీ డీ–01, బీసీ ఈ – 02, అర్బన్–01, అలాగే తొమ్మిదవ తరగతిలో ఓసీ–01, ఎస్సీ–01, అర్బన్–01 చొప్పున సీట్లు ఖాళీ ఉన్నట్లు చెప్పారు. అలాగే బనగానపల్లె బాలుర పాఠశాలలో తొమ్మిదవ తరగతితో బీసీ–02 , బేతంచెర్ల బాలుర పాఠశాలలో తొమ్మిదవ తరగతిలో బీసీ ఏ – 2 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 08వ తేదీలోగా దరఖాస్తులు అందించాలన్నారు. అందించాలన్నారు. ఈనెల 10న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు 7780712810, 9966145662ను సంప్రదించాలన్నారు.