జాతీయ స్థాయిలో ప్రకాశించిన జ్యోతిశ్రావణి | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో ప్రకాశించిన జ్యోతిశ్రావణి

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

బంటుమిల్లి జెడ్పీ విద్యార్థినికి ద్వితీయ బహుమతి

బంటుమిల్లి: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని పక్షి గూళ్లు తయారీ విధానంలో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించినట్లు హెచ్‌ఎం జేవీ పద్మజ సోమవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ, కాకినాడ డివిజన్‌ వారు పక్షి గూడు తయారీ విధానంపై జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న స్థానిక జెడ్పీ పాఠశాల 7వ తరగతి విద్యార్థిని ముత్యాల జ్యోతిశ్రావణి ద్వితీయ బహుమతి సాధించింది. శ్రావణికి బోటనీ టీచరు కోళ్ల మాధవీప్రియదర్శిని గైడ్‌గా వ్యవహరించారు. ఈ నెల 26న కాకినాడలో జరిగిన ప్రపంచ మడ అడవుల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే, రాజమండ్రి చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ టి.జ్యోతి చేతుల మీదుగా శ్రావణికి బహుమతి ప్రదానం చేశారు. టీచర్‌ మాధవి ప్రియదర్శినికి ఉత్తమ గైడ్‌టీచర్‌గా ప్రశంసాపత్రం అందజేశారు. వీరిని ఎంఈఓ 1,2 బి.ఆదినారాయణ, ఎ.వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం జేవీ పద్మజ, ఉపాధ్యాయులు పండు, గోపయ్య అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement