జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పేట విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పేట విద్యార్థుల ప్రతిభ

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

జగ్గయ్యపేట అర్బన్‌: పట్టణానికి చెందిన వారియర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ విద్యార్థులు ఈనెల 25,26 తేదీల్లో మైసూరు లోని చాముండి విహార్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన 29 వ ఆలిండియా షిటోర్యో కరాటే–డో చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనపరిచారు. అకాడమీకి చెందిన ఎ.దైనిక, పి.జితేంద్ర జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి త్వరలో జపాన్‌లో సెప్టెంబర్‌ 20 నుంచి 27 వరకు జరగనున్న 11 వ ఇంటర్నేషనల్‌ షిటోర్యో కరాటే–డో చాంపియన్‌షిప్‌ పోటీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. టి.లోహిత తృతీయ స్థానం సాధించగా, పి.అభిషిక్త్‌ మంచి ప్రతిభ కనపరిచాడు. ఈ సందర్భంగా సోమవారం అకాడమీలో జరిగిన అభినందన కార్యక్రమంలో అకాడమీ కోచ్‌ ఎరుగురాల పూజ విద్యార్థుల కృషిని అభినందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా వారు అత్యుత్తమ ప్రతిభ కనపరచి దేశానికి, జగ్గయ్యపేటకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement