పట్టుబడిన స్కూటీల దొంగ | - | Sakshi
Sakshi News home page

పట్టుబడిన స్కూటీల దొంగ

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

జి.కొండూరు: స్థానికంగా స్కూటీలను చోరీ చేస్తున్న దొంగను జి.కొండూరు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జి.కొండూరుకు చెందిన అజయ్‌బాబు అనే యువకుడు వాహన చోదకులు రోడ్డుపై పార్క్‌ చేసి వాహనాలకు తాళపు చెవి వదిలేసి వెళ్లగానే ముందుగా ఆ తాళపు చెవులను చోరీ చేసేవాడు. అవే తాళపు చెవులతో రాత్రి సమయాలలో స్కూటీలను చోరీ చేసేవాడు. ఈ విధంగా ఇటీవల జి.కొండూరులో మూడు స్కూటీలను ఎత్తుకెళ్లాడు. ఈ స్కూటీలను విక్రయించేందుకు వేరే ప్రాంతానికి తరలించే యత్నంలో భాగంగా గెయిల్‌ కంపెనీ ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో సంచరిస్తుండగా అజయ్‌బాబుని జి.కొండూరు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మూడు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. అజయ్‌బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement