వడగాడ్పులకు ప్రజలు విలవిల | - | Sakshi
Sakshi News home page

వడగాడ్పులకు ప్రజలు విలవిల

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

● శనివారం ఒక్క రోజే పది మంది మృత్యువాత ● ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో 30 మందికి పైగా మృతి

లబ్బీపేట(విజయవాడతూర్పు): వేసవి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వడడ్పులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. కూలీ పనులకు వెళ్లి కొందరు, యాచకులు మరికొందరు, అత్యవసర పనులపై తిరిగే ఇంకొందరు వడగాడ్పుల ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజుల్లో దాదాపు 28 మంది మృతికి వడదెబ్బ కారణంగా భావిస్తున్నారు. శనివారం విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురిని ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకురాగా, అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. విజయవాడ వన్‌టౌన్‌లో ఒకరు, సత్యనారాయణపురంలో ఒకరు, బస్టాండ్‌లో మరో ఇద్దరు, ఇబ్రహీంపట్నంలో ఒకరు, గంపలగూడెం మండలం గాదెవారిగూడెంలో ఒకరు, గంపలగూడెం పడమట దళితవాడలో ఒకరు మృతిచెందారు. శుక్రవారం సైతం వడ గాడ్పుమరో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మంది మృత్యువాత పడ్డారు. విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను సైతం పోలీసులు మార్చురీకి తరలిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నివేదిక అనంతరమే వడదెబ్బ మరణాలుగా నిర్ధారిస్తా మని అధికారులు పేర్కొంటున్నారు.

రెండు రోజుల్లో 30 మంది వరకూ...

ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో 30 మంది వరకూ వడదెబ్బతో మృత్యువాడ పడ్డారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోనే తొమ్మిది మంది ఉన్నారు. వారిలో సత్యనారాణపురం స్టేషన్‌ పరిధిలో శనివారం ఒకరు మృతి చెందగా, శుక్రవారం సీతారామపురం, కస్తూరి భాయిపేట, రాఘవయ్యపార్కు, బీసెంటు రోడ్డు, ఎల్‌ఐసీ భవనం, సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో 32 ఏళ్ల పఠాన్‌ నాగుల్‌మీరా కూలిపనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృత్యువాడ పడ్డాడు. విజయవాడ తూర్పులో రెండు రోజుల్లో గుణదలలో 44 ఏళ్ల శరత్‌బాబుతో పాటు, ప్రభుత్వాస్పత్రి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలు మృత్యువాత పడింది. వారితో పాటు శనివారం ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి వచ్చిన మరో ముగ్గురు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. విజయవాడ పశ్చిమలో శుక్రవారం ముగ్గురు, శనివారం ఒకరు మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లాలో పెనమలూరు, పెడన, గుడివాడ, వేకనూరు, తోట్లవల్లూరు, మోపిదేవిలో ఒక్కో మరణం నమోదైంది. ఇలా మొత్తం ఉమ్మడి కృష్ణాలో ఇప్పటి వరకూ 30 మంది వరకూ ఎండల తీవ్రతతో మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement