పెనుగంచిప్రోలు: అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్‌వీ మాధవ్ అన్నారు. స్థానిక మునేరు అవతల కంఠంనేని గార్డెన్స్‌లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ఎన్టీఆర్ జిల్లా రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో మాధవ్ మాట్లాడుతూ దేశం ముందు.. పార్టీ తరువాత.. వ్యక్తిగతం చివర అనే సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. హిందూ జీవన దృష్టి అంటే అందరినీ సమానంగా చూసే దృష్టి అన్నారు. ప్రపంచ గందర గోళానికి సమాధానం మన ఆధ్యాత్మికం ద్వారా దొరుకుతుందన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ బీజేపీకి కమలం గుర్తు పెట్టారని, కమలం బురదలో నుంచి వికసిస్తుందని, కమలానికి బురద అంటదన్నారు. కమలం పువ్వులోని రేకలు ప్రజాస్వామ్యం, సమానత్వం, సర్వధర్మ భావన, విలువలతో కూడిన రాజకీయం, జాతి జాతీయత వంటి పంచ నిష్టలతో ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్ అనే నినాదంతో పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్, దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ కమిటీ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఉప్పాలపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి, సయ్యద్ బాషా, మువ్వల సుబ్బయ్య, గణేష్, జిల్లా నాయకులు కల్లూరి శ్రీవాణి, అన్నెపాక ప్రపుల్ల శ్రీకాంత్, స్థానిక నాయకులు నరసింహారావు, స్వామి, తునికిపాటి రామాచారి, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్‌వీ మాధవ్


