బార్ లైసెన్స్ రద్దు కోసం ఆందోళన
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు బీవీఆర్ కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేయనున్న బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని మహిళలు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. బార్ ఎదురుగా టెంట్ వేసి బైఠాయించారు. బార్ తొలగించాలి, డౌన్ డౌన్ ఎకై ్సజ్ శాఖ, లైసెన్స్ రద్దు చేయాలి అంటూ మహిళలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సుమారు 300 కుటుంబాలకు చెందిన వారందరం నివసిస్తున్నామని, తమ ఇళ్లు, పాఠశాలలు, హాస్పిటల్‌కు అతి సమీపంలో బార్‌ను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఈ ప్రాంతంలో వైన్స్ షాపు నిర్వహించారని అప్పట్లో మందు బాబుల ఆగడాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం బార్‌తో పాటు రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థినులు, మహిళలు, చిన్నపిల్లలకు భద్రత కరువు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనసంచారం లేని చోట, జాతీయ రహదారికి అర కిలో మీటరు దూరంలో, స్కూల్స్, హాస్పిటల్స్ లేని ప్రాంతంలో మద్యం విక్రయాలు నిర్వహించాలని జీఓ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో బార్ ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన వైన్స్ షాపు ఫలితంగా చైన్ స్నాచర్లు, గంజాయి, మద్యం బ్యాచ్‌ల వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. తక్షణం బార్ లైసెన్స్ రద్దు చేయా లని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తా మని ఎకై ్సజ్ అధికారులను హెచ్చరించారు.


