విద్యార్థులకు కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కౌన్సెలింగ్‌

Dec 29 2025 9:22 AM | Updated on Dec 29 2025 9:22 AM

విద్య

విద్యార్థులకు కౌన్సెలింగ్‌

విద్యార్థులకు కౌన్సెలింగ్‌ గన్నవరం: స్థానిక ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాలలోని హాస్టల్స్‌లో జరుగుతున్న ర్యాగింగ్‌పై అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. సాక్షి పత్రికలో వచ్చిన ‘గన్నవరం వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్‌’ కథనంపై కళాశాల అధికారులు స్పందించారు. కళాశాలలోని బాలుర, బాలికల హాస్టల్స్‌ను సందర్శించి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కిషోర్‌ ఆదేశాల మేరకు కళాశాల ప్రాంగణంలోని బాలుర, బాలికల వసతి గృహాలను కాలేజీ స్టూడెంట్స్‌ ఎఫైర్స్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సీహెచ్‌ వెంకటశేషయ్య, హాస్టల్‌ వార్డెన్లు డాక్టర్‌ ఎస్‌. శ్రీధర్‌, డాక్టర్‌ ఆశాలత వసతి గృహాలను సందర్శించారు. అక్కడ జూనియర్‌ విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందుల గురించి వివరించారు. అయితే ర్యాగింగ్‌పై ఎవరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని వార్డెన్‌ శ్రీధర్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఎటువంటి ర్యాగింగ్‌ సంఘటనలు జరగకుండా విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు చెప్పారు. ర్యాగింగ్‌ కథనంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు కూడా ఆరా తీశారు. ఆయన ఆదేశాల మేరకు స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది కళాశాలకు వచ్చి వివరాలను సేకరించారు. దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలి వైభవంగా తిరుప్పావై

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక్ష దైవమైన సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు జరిపించగా, సూర్య నమస్కారాలు, వేద పండి తులు సూర్యోపాసన సేవ నిర్వహించారు. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్‌ మార్గంలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆరోగ్యకర జీవితంతో పాటు కాలుష్య రహిత భవిష్యత్తుకు సైకిల్‌ సవారీ దోహదం చేస్తుందని.. చిన్నారులు, యువత సైక్లింగ్‌ను అలవాటు చేసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతి వనం వద్ద ఫిట్‌ ఇండియా ఆన్‌ సండేస్‌ సైకిల్‌ రన్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్‌ లక్ష్మీశ సైక్లింగ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. 50 మందికిపైగా చిన్నారులతో పాటు క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి బెంజ్‌ సర్కిల్‌, పాలీ క్లినిక్‌ రోడ్డు, పీబీ సిద్ధార్థ కళాశాల, రెడ్‌ సర్కిల్‌ మీదుగా దాదాపు 9 కి.మీ. సైక్లింగ్‌ చేశారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో కాకర్ల కోటేశ్వరరావు, జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు సుగుణరావు, కోచ్‌ రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ కల్చరల్‌: లబ్బీపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం 26వ వార్షిక జయయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాతం, తిరుప్పావై, కశల ఆవాహనం, అష్టోత్తరం, నక్షత్రమాల జపయజ్ఞం నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరా గ్రూప్‌, విష్ణు సహస్రనామ జపయజ్ఞం, ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా ఈ కార్యక్రమం జరిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ముక్కోటికి ప్రత్యేక ఏర్పాట్లు..

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ముక్కోటి సందర్భంగా దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపారు.

విద్యార్థులకు కౌన్సెలింగ్‌ 1
1/2

విద్యార్థులకు కౌన్సెలింగ్‌

విద్యార్థులకు కౌన్సెలింగ్‌ 2
2/2

విద్యార్థులకు కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement